అమెరికా, ఇజ్రాయెల్ దాడి... సురక్షిత బంకర్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ తరలింపు

  • దాడుల నేపథ్యంలో ప్రస్తుతం టెహ్రాన్‌లో ఖమేనీ లేరని మీడియా కథనాలు
  • ఎప్పుడు, ఎక్కడకు తరలించారనే వివరాలు వెల్లడి కాలేదు
  • ఆయన ఎక్కడున్నారో సన్నిహితులకు మాత్రమే తెలుసని మీడియా కథనాలు
టెహ్రాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడి నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సురక్షితమైన ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన టెహ్రాన్‌లో లేరని, వేరే ప్రాంతానికి తరలివెళ్లారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయనను ఎక్కడకు తరలించారు, ఎప్పుడు తరలించారనే వివరాలు వెల్లడి కాలేదు. దాడులు జరిగినప్పుడు ఖమేనీ టెహ్రాన్‌లో లేరని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఆయనను రహస్య భూగర్భ బంకర్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది.

అమెరికా, ఇజ్రాయెల్ దాడి ప్రారంభం కాగానే ఖమేనీని అత్యంత రహస్య ప్రదేశానికి తరలించారని ఇరాన్ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. సుప్రీం లీడర్‌ను సురక్షిత భూగర్భ బంకర్‌లో దాచి ఉంచారని, కేవలం ఆయన సన్నిహితులకు మాత్రమే ఆయన ఎక్కడ ఉన్నారో తెలిసే అవకాశం ఉందని తెలిపింది.

ఖమేనీ ఇరాన్ వదిలి వెళ్లాలని లేదంటే విడిచిపెట్టే ప్రసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఖమేనీ లక్ష్యంగా అమెరికాతో కలిసి సంయుక్త దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఖమేనీ, అధ్యక్ష భవనాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.

Ayatollah Ali Khamenei
Iran
Israel
United States
attack
Tehran
safe bunker
Donald Trump

More Telugu News